కేరళలో ఒక పక్షి భారత జాతీయ జెండాను ఎగురవేసిందా? అసలు ఏం జరిగిందంటే? (video)

సెల్వి

శనివారం, 17 ఆగస్టు 2024 (14:24 IST)
కేరళలో ఒక పక్షి భారత జాతీయ జెండాను ఎగురవేస్తున్నట్లు కనిపించే వీడియో ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. జెండా వందనం కార్యక్రమంలో భారత జాతీయ జెండా స్తంభం పైభాగంలో ఇరుక్కుపోయింది. 
 
దీంతో అక్కడున్నవారు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నంలో ఉండగానే, ఎక్కడి నుండో ఒక పక్షి వచ్చి ఆ ఇరుక్కున్న జెండా ముడిని విప్పేసింది. ఈ ఘటన చూపరులను ఆశ్చర్యానికి గురి చేసింది.
 
ఆగస్టు 17న పోస్ట్ చేసిన ఈ ఫుటేజీకి సోషల్ మీడియాలో మిలియన్ వ్యూస్ వచ్చాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కొంతమంది వ్యక్తులు జెండాను ఎగురవేసినట్లు క్లిప్ చూపిస్తుంది. 
 
జెండా స్తంభం పైభాగానికి చేరుకుని, విప్పబడకుండా ఉండగా, ఒక పక్షి జెండాను కదిలించింది. ఆపై జెండా విప్పి, అందులోని పువ్వులు కిందపడి పువ్వుల వర్షం కురిసింది. 
 

Let's look from another view. pic.twitter.com/p3hIs6j3Kn

— ????Che_ಕೃಷ್ಣ????????????❤️ (@ChekrishnaCk) August 17, 2024
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇది "దైవిక జోక్యం!" అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. "ఈ ప్రకృతి ఏదో దాగి ఉంది. మనుషులే అర్థం చేసుకోలేకపోతున్నారు" అని మరొకరు వ్యాఖ్యానించారు.
 
ఇలా రకరకాలుగా ఈ వీడియోపై నెటిజన్లు స్పందించడంతో.. ఈ వీడియోలో అసలు విషయం ఎంతని తెలియవచ్చింది. ఈ వీడియోలోని పక్షి జాతీయ జెండా స్తంభం పైకి రాలేదని.. బదులుగా, జెండాస్తంభం వెనుక కొబ్బరి ఆకుపై కూర్చున్న తర్వాత అది ఎగిరిపోయింది. జెండా విప్పడంలో ఆ పక్షి అటు వైపుగా ఎగిరిందని.. రెండవ వీడియోలో స్పష్టం అవుతోంది. ఈ రెండో వీడియో చూస్తే అసలు సంగతి బయటపడుతోంది. 

Kerala - National Flag got stuck at the top while hoisting. A bird came from nowhere and unfurled it!! ✨ pic.twitter.com/lRFR2TeShK

— Shilpa (@shilpa_cn) August 16, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు