పెళ్లికి ప్రపోజల్.. నో చెప్పిందని పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. చివరికి?

గురువారం, 10 అక్టోబరు 2019 (15:01 IST)
పెళ్లికి ప్రపోజల్ పెట్టాడు. కానీ యువతి తిరస్కరించడంతో ప్రేమోన్మాది పెట్రోల్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతీయువకులు మృతి చెందారు.  కేరళలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఎర్నాకుళం జిల్లా కక్కనాడ్‌కు చెందిన 17 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యార్థిని దేవిక వెంటపడ్డాడు మిథున్ అనే యువకుడు. 
 
పెళ్లి చేసుకుంటానంటూ ప్రపొజల్ పెట్టాడు. కానీ అతడి ప్రతిపాదనను సదరు యువతి తిరస్కరించింది. ఇంకా ఇంటికి సమాచారం చేరవేసింది. అంతే ఏకంగా ఆ యువతి ఇంటికే వెళ్లాడు. యువతి తల్లిదండ్రులతో మాట్లాడాడు. 
 
దేవిక మైనర్ కావడంతో యువతి తల్లిదండ్రులు ఇప్పుడే కుదరదని చెప్పేశారు. ఇంకా ఆ యువకుడి తీరు నచ్చకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కూడా పెళ్లికి నో చెప్పారు. దాంతో పగ పెంచుకున్న మిథున్ అదను చూసి యువతిపై దాడికి దిగాడు. బుధవారం ట్యూషన్ వెళ్లొస్తున్న దేవికతో పెళ్లి చేసుకోమని గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా రాత్రి ఆమె ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. 
 
పెళ్లికి అంగీకరించాలని ఎంత పట్టుబట్టినా.. దేవిక వినిపించుకోకపోవడంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలు కాస్తా మిథున్‌కు కూడా అంటుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో దేవిక తండ్రికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు