చైత్రమాసం పౌర్ణమితో ముగుస్తుంది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి, సోమావతి అమావాస్య, బైసాఖీ, శ్రీరామ నవమి, చైత్ర పౌర్ణమి వంటి ప్రత్యేక రోజుల్లో భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.
ఈ నాలుగు నెలల వ్యవధిలో కనీసం ఐదు కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లను పూర్తి చేసింది. అదెలా ఉన్నప్పటికీ.. కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది భక్తులు కుంభమేళాకు హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.