విడాకులు కోరిన మహిళను పరుగెత్తించి కొట్టిన న్యాయవాది.. ఎక్కడ?

సోమవారం, 9 మే 2022 (08:56 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తన భర్త నుంచి విడాకులు కావాలని కోరిన ఓ మహిళను న్యాయవాది పరుగెత్తించి కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ రాష్ట్రంలోని షాడోల్‌ ప్రాంతంలో ఓ మహిళ తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది. ఈ కేసులో ఆమె భర్త తరపున వాదిస్తున్న ఓ న్యాయవాది.. విడాకులు కోసం కోర్టుకెక్కినందుకు ఆ మహిళను చావబాదాడు. ఈ ఘటన కోర్టు ఆవరణలో పట్టగపగలు జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
 
ఈ విచారణలో మహిళపై దాచేసిన వ్యక్తిని న్యాయవాది భగవాన్‌సింగ్‌గా గుర్తించారు. ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వృద్ధ న్యాయవాది ఆ మహిళను వెంబడించడం, కోర్టు ఆవరణలోనే ఆమె వెనుక భాగంలో కొట్టడం వీడియోలో చూడవచ్చు. అయితే, ఆ మహిళను భగవాన్ సింగ్ కొడుతుండగా ఒక్కరంటే ఒక్కరు కూడా అడ్డుకునేందుకు ముందుకురాలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు