టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో దయచేసి మీరు వెనుక సీట్లలో కూర్చున్నప్పటికీ సీట్ బెల్ట్ ధరించండి.
సైరస్ మిస్త్రీ వెనుక సీటులో కూర్చున్నారు, ప్రాణాలతో బయటపడిన ఇద్దరు వ్యక్తులు సీటు బెల్ట్‌తో ముందు కూర్చున్నారు. వాహనంలో నలుగురు వ్యక్తులు ఉండగా అందులో మిస్త్రీ సహా ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన మరో వ్యక్తిని జహంగీర్ బిన్షా పండోల్‌గా గుర్తించారు.
గాయపడిన వారిని - బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లోని టాప్ డాక్టర్ అనాహిత పండోల్, జేఎం ఫైనాన్షియల్ ప్రైవేట్ ఈక్విటీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో అయిన డారియస్ పండోల్‌గా గుర్తించబడ్డారు. ఇంకా చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు.
కారులో సీటు బెల్టు ధరించని పక్షంలో ఎయిర్ బ్యాగ్ వంటివి ఉపయోగపడవు. మొదట సీటు బెల్ట్ ధరించడం పాటించినట్లైతేనే ఎయిర్ బ్యాగ్ రక్షణ లభిస్తుంది. అలాగే సిట్టింగ్ చైర్ సీట్ బెల్ట్ సరిగ్గా లాక్ చేయకపోతే ఎయిర్ బ్యాగ్ తెరుచుకోదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని కార్లు వెనుక సీటు బెల్ట్‌లను కలిగి ఉంటాయి, కానీ చాలా తక్కువ మంది మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నారు. వెనుక సీటులో బెల్టు ధరించడం సురక్షితమా అంటూ చాలామంది తేలికగా తీసిపారేస్తారు. అయితే రోడ్డు ప్రమాదం సమయంలో వెనుక ఉన్న వ్యక్తి కొన్నిసార్లు 40G (40 రెట్లు గురుత్వాకర్షణ, అంటే 80కేజీల బరువున్న వ్యక్తి 3200కేజీల బరువుగా ఉంటాడు) శక్తితో విసిరివేయబడతాడు.
ముందు ప్రయాణీకుడు సీటు బెల్ట్ ధరించి, వెనుక ప్రయాణీకుడు ధరించకపోతే, రోడ్డు ప్రమాదం సమయంలో వెనుక ప్రయాణీకుడు ఏనుగు బరువుతో పడిపోవడం వల్ల ముందు ప్రయాణీకుడు తీవ్రంగా గాయపడటం లేదా మరణించే అవకాశం ఉంది.
ఇది వినేందుకు పూర్తిగా ఆశ్చర్యంగా వున్నా.. ముమ్మాటికీ ఇది నిజం. అందుచేత సీటు బెల్టులు ధరించి.. జర్నీ చేయండి. రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడిండి. ఇంకా దయచేసి ప్రయాణ సమయాల్లో భద్రతా నియమాలను పాటించండి.
ఇంకా ఈ ఘటనపై జర్నలిస్ట్ రాజేష్ కల్రా ట్విట్టర్‌లో పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో "కారు వెనుక కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకూడదని దాదాపు నాకు తెలుసు. సైరస్ మిస్త్రీ కారు ప్రమాదానికి గురైన సమయంలో సీటు బెల్ట్ విషయం మైనస్. ఆయన వెనుక సీటులో కూర్చున్నారు. ఢీకొన్నప్పుడు బెల్ట్ లేని వెనుక సీటు ప్రయాణీకుడికి ఏమి జరుగుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. దయచేసి ఎల్లప్పుడూ #SeatBelt ధరించండి" అంటూ రాజేష్ కల్రా తెలిపారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
Almost all I know dont fasten seat belt while sitting in the cars rear. #CyrusMistry was sitting in the rear seat minus the seat belt during collision. This simulation shows what happens to an unbelted rear seat passenger in case of a collision. Please #WearSeatBelt ALWAYS! pic.twitter.com/HjS9weMOT0