కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూశారు. అరుణ్ జైట్లీ మృతిపట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కాగా... ఇటీవల తీవ్ర అనారోగ్యం కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
న్యాయకోవిదుడైన రాంజెఠ్మలనీ ఆ శాఖకు రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు కూడా జైట్లీనే స్వీకరించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం రూపకల్పనలో జైట్లీనే కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ బాధ్యతల కోసం కేబినెట్ నుంచి వైదొలగినా.. 2003లో మళ్లీ కామర్స్ అండ్ లా మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో అద్వానీ ఆయన్ను రాజ్యసభలో పార్టీ నాయకుడిగా నియమించారు.
అప్పట్లో ఉమాభారతి వ్యతిరేకించినా.. ఆయన చౌహాన్కే ఓటు వేశారు. ఆ తర్వాత చౌహాన్ మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు భాజపాను నిలబెట్టారు. ఇక నోట్ల రద్దు, జీఎస్టీ, దివాలా చట్టానికి కోరలు తొడగడంలో జైట్లీ కీలక పాత్రను పోషించారు.