జూన్ 15 వరకు లాక్ డౌన్.. నిబంధనలు కఠినతరం చేస్తారా?

శనివారం, 30 మే 2020 (11:52 IST)
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మరోమారు లాక్ డౌన్ పొడిగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి. కనీసం జూన్ 15 వరకు లాక్డౌన్ పొడిగించేందుకు కేంద్రం సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరోమారు లాక్ డౌన్ పొడిగిస్తే... నిబంధనలను మరింత కఠినతరం చేయాలా లేక సడలించాలా అనే నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
అయితే రాష్ట్రాలకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ కేంద్రం సమన్వయం చేయనుంది. విద్యా సంస్థలు, మెట్రో సేవల పున:ప్రారంభంపై ఆయా రాష్ట్రాలే నిర్ణయం తీసుకునేలా కేంద్రం వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాలైన ఆలయాలు, మసీదులు, చర్చిల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం కానుంది. 
 
వైరస్ అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్న వాటిపై నిషేధం కొనసాగనుందని సమాచారం. ముఖ్యంగా అంతర్జాతీయ విమాన సేవలు, రాజకీయ సమావేశాలు, మాల్స్, థియేటర్లపై నిషేధం కొనసాగే అవకాశం ఉంది. అలాగే 80 శాతం కరోనా కేసులు నమోదైన 30 మున్సిపాలిటీల్లో మాత్రం కఠిన ఆంక్షలు విధించక తప్పదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు