భారత్‌కు మిడతలతో తలనొప్పి... అంతా పాకిస్థాన్ వైఫల్యమే..

మంగళవారం, 26 మే 2020 (20:47 IST)
Locusts attack
భారత్‌కు మిడతల కారణంగా కొత్త తలనొప్పి వచ్చింది. మిడతల కడ్డటిలో పాకిస్థాన్ పూర్తిగా విఫలమవడంతో మరి కొంత కాలం పాటూ వీటి దాడి కొనసాగుతుందట. ప్రస్తుతం భారత్‌ ఎదుర్కొంటున్న మిడతల దాడి గత 26 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనుకూల వాతావరణం, మిడతల కట్టడిలో పాక్ వైఫల్యం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్న మిడతల జనాభాతో భారత్‌కు కొత్త తలనొప్పులు తెస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. 
 
ఈ సమస్య మరికొన్ని రోజులు ప్రజలను వేధిస్తున్న హెచ్చరిస్తున్న అధికారులు వాటి కట్టడి కోసం పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 11న తొలిసారిగా శైశవ దశలో ఉన్న మిడతలు సరిహద్దులో కనిపించాయని అధికారులు తెలిపారు. అవి ఎగరలేని స్థితిలో ఉండటంతో వాటిని సులువుగానే వదిలించుకోగలిగామని చెప్పారు. 
 
ప్రస్తుతం దేశంలోకి ప్రవేశిస్తున్న మిడతలు పెద్దవని, గుడ్లు పెట్టేందుకు అనువైన స్థలం కోసం వెతుకుతున్నాయని అధికారులు వెల్లడించారు. వెత్తనైన, తడినెలల కోసం మిడతల అన్వేషిస్తుంటాయని, ఇటువంటి ప్రాంతాలను గుర్తించి క్రిమిసంహారకాలు జల్లుతున్నామని.. దీంతో వాటి పీడ విరగడవుతుందని వారు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు