కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరూ ఉపాధిని కోల్పోయారు. రిక్షా పుల్లర్ నుంచి ఐటీ ఉద్యోగి వరకూ ఇలా ప్రతి రంగంలోనూ ఉపాధి కోల్పోయిన అనేక మంది ఉన్నారు. అలాగే, వ్యభిచారవృత్తిని సాగిస్తూ వచ్చిన వారు కూడా ఉపాధిని కోల్పోయారు. అంతేకాకుండా, కొంతమంది నీలి చిత్రాల్లో నటించేవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారంతా ఇపుడు కరోనా లాక్డౌన్ సడలింపులతో తిరిగి తమతమ వృత్తుల్లో వెళుతున్నారు. అయితే, కొందరు యువతులతో నీలి చిత్రాలు తీసి ఓటీటీలో పోస్టు చేస్తున్న ముగ్గురి ముఠాను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
రాష్ట్రంలోని గ్వాలియర్ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు దీపక్ సోని, అతని స్నేహితుడు కేశవ్ సింగ్‌తో కలిసి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. ఇండోర్ నగరంలోని ఓ ఫాంహౌస్‌లో ముగ్గురు మోడళ్లతో కలిసి నీలిచిత్రాలు తీసి అశ్లీల సైట్లలో పోస్టు చేశారని సైబర్ పోలీసుల దర్యాప్తులో తేలింది.
మోడలింగ్ ఏజెన్సీ నడుపుతున్న బ్రిజేంద్ర గుర్జార్, కెమెరామెన్ అంకిత్ చావ్డాలు మరో ఐదుగురికి ఈ నీలిచిత్రాలతో సంబంధాలున్నాయని తేలింది. చిత్ర నిర్మాణం పేరిట మోడళ్లతో నీలిచిత్రాలు తీస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్ నివాసి హుసేన్ అలీ సహకారంతో 22 దేశాల్లో ఈ నీలిచిత్రాలను పోస్టు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.