మొత్తం ఎనిమిది ఏఈఎసిల ద్వారా రుణాల పంపిణీకి సంబంధించిన పోర్టల్‌లో అప్‌లోడ్ సబ్సిడీ షీట్‌లో సుమారు రూ.15 కోట్ల వరకు తేడా వచ్చింది. దీనిపై పై అధికారులు వివరణ కోరారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, శ్రీవాస్తవ కుశ్వాహాకు నోటీసులు జారీ చేశారు.
ఈ సూసైడ్ నోట్‌లో బ్యాంకు ఎండీ విశేష్ శ్రీవాస్తవ, అసిస్టెంట్ మేనేజర్హే మహేష్ కుమార్ మాథుర్ పేర్లను పేర్కొన్నాడు. తమ అక్రమాలకు, అవినీతికి సహకరించాలంటూ ఉన్నతాధికారులు తనను వేధించారంటూ ఆ లేఖలో పేర్కొనడం కలకలం రేపింది.
మరోవైపు ఈ విషయంలో గత ఆరు నెలలుగా తండ్రి మానసిక వేదన అనుభవించాడని కుమారుడు నరేంద్ర చెప్పారు. బ్యాంకులో అవినీతికి పాల్పడటం ద్వారా తమకు డబ్బులు ఇవ్వమని ఎండీ, ఇతర ఉన్నతోద్యోగుల నుంచి ఒత్తిడి ఉండేదని ఆరోపించారు.