ఆ గ్రామంలో ఒక్క కరోనా కేసు కూడా లేదు.. యువకుల టీమ్ అదుర్స్

శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (16:56 IST)
covid free village
కోవిడ్ మహమ్మారి దేశం నలుమూలలా వ్యాపిస్తోంది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లో కూడా కరోనా వ్యాపించింది. ప్రస్తుతం గ్రామాలకు మహమ్మారి భయం పట్టుకుంది. వివిధ నగరాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి గ్రామాలకు వస్తుండటంతో గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి. 
 
అయితే ఒక గ్రామంలో మాత్రం కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే, మధ్యప్రదేశ్‌లోని అగర్-మాల్వా గ్రామంలో ఈనాటి వరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు. 2020లో కరోనా మహమ్మారి వ్యాపిస్తుందన్న సమయంలో ఆ గ్రామంలోని ప్రజలు అప్రమత్తం అయ్యారు. 
 
ఇళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు. మాస్క్, భౌతిక దూరం వంటి వాటిని పాటిస్తున్నారు. ఏ ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లినా తప్పనిసరిగా చేతులు, ముఖం శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
అదే విధంగా గ్రామంలోని యువకులు ఒక టీమ్‌గా ఏర్పడి గ్రామంలోకి ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినా వారి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నాకే గ్రామంలోకి రానిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు