వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల అజ్జు ఇంటర్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి అతడికి డ్యాన్స్ అంటే ప్రాణం. దేశంలోనే తనొక గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నాడు. కానీ అజ్జు తల్లితండ్రులకు అతడు డ్యాన్సర్ అవడం ఇష్టం లేదు. అందువల్ల ఎప్పుడూ చదువు మీద మాత్రమే శ్రద్ధ పెట్టమని హెచ్చరించేవారు.
తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో అతడి కుటుంబసభ్యులు సహకరించడం లేదని ఎప్పడు తన స్నేహితుల వద్ద గోడు వెల్లబోసుకునేవాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన అజ్జు ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న జాన్సీ రోడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అక్కడ పోలీసులకు అజ్జు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది.
ఆ లేఖలోప్రభుత్వానికి నాదొక విన్నపం. నా చావు తర్వాత నాపై ఒక పాటను రాయించాలి. దేశంలోనే అతి పెద్ద సింగర్ అయిన అర్జిత్ సింగ్‌తో ఆ పాటను పాడించాలి. నేపాల్‌కు చెందిన ప్రముఖ డ్యాన్సర్ సుశాంత్ కత్రి ఆ పాటకు డ్యాన్స్ చేయాలి. ఆయనే దానికి కొరియోగ్రాఫర్‌గా కూడా చేయాలి. నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతాను. నా చివరి కోరిక నెరవేర్చితేనే నా ఆత్మ శాంతిస్తుంది. నా ఈ చిన్న కోరికను తీర్చమని ప్రధానిని కూడా కోరుకుంటున్నాను అని తెలిపాడు.