ముంబై నగరంలోని తాషేగామ్ ప్రాంతానికి చెందిన అవినాష్ దాదాసాహెబ్ భగ్వాడే (50) కాలేయ సమస్యతో బాధపడుతుండటంతో అతని కుటుంబ సభ్యులు సాంగ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భగ్వాడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటుండగా ఆసుపత్రి వైద్యులు అతను మరణించాడని చెప్పి మరో వ్యక్తి మృతదేహాన్ని భగ్వాడే కుటుంబసభ్యులకు అప్పగించారు.
దీంతో భగ్వాడే కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని తీసుకొని ఆసుపత్రికి వెళ్లగా అక్కడ భగ్వాడే చికిత్సపొందుతూ కోలుకుంటూ కనిపించాడు. బతికున్న రోగి మరణించాడంటూ మరొకరి మృతదేహాన్ని అప్పగించిన ఆసుపత్రి వైద్యుల నిర్వాకంపై భగ్వాడే కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుచేసి, కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుభోద్ ఉగానే చెప్పారు.