రక్తనమూనా లేకుండానే మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర స్థాయిని చూసుకోవడానికి ఓ అధునాతన పరికరాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు సెయింట్ పీటర్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ పరిశోధన కేంద్రంలోని బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగం తెలిపింది. రోగి ముక్కు ద్వారా గాలిని ఈ పరికరంలోకి వదులుతూ చక్కెర స్థాయిని తెలుసుకోవచ్చని తెలిపింది.