రసాయన కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌: 30మందికి అస్వస్థత

మంగళవారం, 12 అక్టోబరు 2021 (18:51 IST)
Gas
మహారాష్ట్రలోని ఓ రసాయన కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో 30 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. కర్మాగారం సమీపంలో నివసిస్తున్న స్థానికులు ఊపిరాడకపోవడం, కళల్లో మంట, వికారం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్‌ చీఫ్‌ సంతోష్‌ కదం తెలిపారు. అంబర్‌నాథ్‌లోని మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (MIDC)లో ఉన్న ఓ ప్లాంట్‌ నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ లీక్ అయినట్లు ఆయన చెప్పారు.
 
ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర సమస్యలతో 34 మంది ఉల్లాస్‌నగర్‌లోని సెంట్రల్‌ ఆసుపత్రిలో చేరారినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, గ్యాస్‌ లీక్‌ కాకుండా చర్యలు చేపట్టారు. లీకేజీకి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు సంతోష్‌ కదం వివరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు