ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం - వాహనాలు దగ్ధం

గురువారం, 9 జూన్ 2022 (11:20 IST)
ఢిల్లీ మెట్రో స్టేషన్‍లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జామియా నగరులోని ఎలక్ట్రిక్ మోటార్ వాహనాల పార్కింగ్ స్థలంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపకదళ సిబ్బంది మంటలను ఆర్పివేశాయి. అయితే, అప్పటికే ఈ మంటలకు 90కు పైగా వాహనాలు కాలిపోయాయి. 
 
మెట్రో పార్కింగ్‌లో మంటలు చెలరేగడంతో 10 కార్లు, ఒక మోటార్ సైకిల్, రెండు స్కూటీలు, 30 కార్లు, 50 పాత రిక్షాలు దగ్ధమైపోయాయి. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
 
ఈ ప్రమాదంపై ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ స్పందిస్తూ, జామియా నగర్‌ ప్రాంతంలోని ప్రధాన పార్కింగ్ ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. తమకు గురువారం ఉదయం 5 గంటలకు సమాచరం వచ్చిందని, ఆ వెంటనే అగ్నిమాపకదళ యంత్రాలు, సిబ్బందిని అప్రమత్తం చేసి సంఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేసినట్టు చెప్పారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు