ముస్లింలపై డొనాల్ట్ ట్రంప్ నిర్ణయం.. జుకెర్‌బర్గ్ ఫైర్.. సుందర్ పిచాయ్ ఆదేశాలు

ఆదివారం, 29 జనవరి 2017 (10:10 IST)
ముస్లింలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయంపై ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ తీవ్రంగా నిరసించారు. అమెరికాలోకి ముస్లిం మెజారిటీ దేశాల నుంచి వలసదారులు, శరణార్థులు రాకుండా నిర్ణయం తీసుకోవడాన్ని జుకెర్ బర్గ్ తప్పు పట్టారు. అమెరికానే వలసదారుల దేశం. అందుకు గర్వపడాలి. మీలోని చాలామందిలాగే నేను కూడా ట్రంప్‌ నిర్ణయంపై ఆందోళన చెందుతున్నానని ఫేస్ బుక్‌లో జుకర్ బర్గ్ తెలిపారు.

తాత, ముత్తాతలు జర్మనీ, ఆస్ర్టియా, పోలెండ్‌ నుంచి, భార్య చైనా నుంచి అమెరికాకు వలస వచ్చినవారేనని తెలిపారు. మనది వలసదారుల దేశం. ప్రపంచంలోని ఉన్నతమైన, అత్యుత్తమమైన వారికి ఇక్కడ నివసించేందుకు అవకాశమిస్తే మన దేశమే లాభపడుతుందని జుకర్ బర్గ్ వెల్లడించారు. 
 
మరోవైపు ముస్లిం వలసదారులు, శరణార్థులరాకపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిషేధం విధించిన నేపథ్యంలో విదేశీ పర్యటనల్లో ఉన్న దాదాపు 100 మంది ఉద్యోగులు తక్షణమే అమెరికాకు రావాలని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఆదేశించారు. ట్రంప్‌ ఆదేశాలతో గూగుల్‌లో పనిచేస్తున్న 187 మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. 

వెబ్దునియా పై చదవండి