అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి శశి థూరర్‌పై ఆయన గెలుపొందారు. ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. మొత్తం 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా, థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయి. మరో 416 ఓట్లు చెల్లలేదు.
కాగా, 135 యేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో గత 24 యేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను గాంధీ కుటుంబం వెలువలి వ్యక్తి చేపట్టనుండటం గమనార్హం. దీంతో ప్రస్తుతం అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి ఖర్గే అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనబోతున్నారు.
మరోవైపు, అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన ఖర్గేకు కాంగ్రెస్ నేతలు నుంచి అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఖర్గేకు శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో కొత్త అధ్యాయనం ప్రారంభంకాబోతుందని చెప్పారు.
ప్రస్తుతం ఖర్గే వయసు 80 యేళ్లు. కర్నాటక రాష్ట్రంలో బీదర్ జిల్లా భల్కి తాలూకా వరాపట్టి గ్రామంలో 1942లో ఆయన జన్మించారు. ఆయనకు భార్య రాధాబాయి, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఖర్గే బౌద్ధమతాన్ని అనుసరిస్తారు.