పశ్చిమ బెంగాల్‌లోని మదనాపూర్ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్ వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్‌లో మహిషాసురుడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. మహిషాశుర మర్దిని దుర్గాదేవిగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ వున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మదనాపూర్ జిల్లా మిడ్నాపూర్‌లో తృణమూల్ పార్టీ అభ్యర్థి అనిమా సాహా ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోదీ, అమిత్ షాకి ఇది తీవ్ర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.