ఎన్నికల సందర్భంగా బీజేపీ, కేంద్ర బలగాలు తమను ఎంతగానో వేధించాయని మమత ఆరోపించారు. అయితే ఎవరూ హింసకు పాల్పడకూడదని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా చూడాలని ఆమె కోరారు.
ప్రస్తుతం కొవిడ్‌పైనే తమ దృష్టంతా ఉన్నదని, ఈ మహమ్మారిపైనే తమ పోరాటమని మమత పదే పదే చెప్పారు. దేశం మొత్తం ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని, దీని కోసం రూ.30 వేల కోట్ల కేటాయించాల్సిందిగా మమత కోరారు.
కేవలం 2, 3 రాష్ట్రాలకే కేంద్రం వ్యాక్సిన్లు, ఆక్సిజన్‌ను ఎక్కువగా పంపిణీ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు ఆమె చెప్పారు. ఈ పక్షపాతంపై కేంద్రాన్ని నిలదీస్తామని ఆమె వెల్లడించారు. కేంద్రం ఇప్పటికైనా ఆధిపత్య ధోరణిని మానుకోవాలని హితవు పలికారు.