నెటిజన్ల హాట్ టాపిక్‌గా బీజేపీ, మమతా బెనర్జీ

గురువారం, 19 మే 2016 (11:17 IST)
సోషల్‌ మీడియాలో బీజేపీ, మమతా బెనర్జీ.. హాట్ టాపిక్‌గా మారారు. ఫిబ్రవరి నుంచి మే వరకు నెటిజన్ల సెర్చింగ్‌లో ఎక్కువగా ఉన్నారట. దాదాపు 2 కోట్ల 20 లక్షల మంది వీళ్ల గురించే ఎక్కువగా చర్చించుకున్నారట. పార్టీల పరంగా బీజేపీ గురించి అత్యధికంగా 61 శాతం మంది చర్చిస్తే… రాజకీయ సామ్రాజ్యాన్ని ఏలుతున్న మమతా బెనర్జీ 22 శాతం మందితో టాప్ ప్లేస్‌లో ఉన్నారు. 
 
మమతా బెనర్జీ తర్వాత స్థానంలో కేరళ సీఎం ఊమెన్‌ చాందీ గురించి 20 శాతం మంది చర్చించారు. అలాగే అసోం సీఎం తరుణ్‌ గొగోయ్‌, డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ లీడర్ శర్బానంద సోనోవాల్‌ గురించి కూడా మాట్లాడుకున్నారు. పార్టీలలో కాంగ్రెస్‌ గురించి 47 శాతం, ఆప్‌ గురించి 25 శాతం చర్చ జరుగగా.. డీఎంకే, సీపీఎంల గురించి అత్యంత తక్కువగా 6 శాతం మాత్రమే మాట్లాడుకున్నారని తేటతెల్లమైంది. 

వెబ్దునియా పై చదవండి