ఆర్మీ అధికారి భార్యకు అశ్లీల వీడియో పంపిన ఢిల్లీ వాసి.. ఐటీ యాక్ట్‌పై కేసు
గురువారం, 6 అక్టోబరు 2016 (09:32 IST)
ఢిల్లీలో ఓ కాలనీ సంక్షేమ సంఘ మాజీ అధ్యక్షుడు ఓ నీచపు పనికి పాల్పడ్డాడు. ఆర్మీ అధికారి భార్యకు అశ్లీల వీడియోను పంపించాడు. దీంతో అతనిపై ఐటీ యాక్ట్ మేరకు కేసు నమోదు చేశాడు. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే...
దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఏకే మెహతా పని చేశారు. ఈయన వయసు 40 యేళ్లు. ఇదే కాలనీలో నివాసముంటున్న ఆర్మీ అధికారి భార్యకు నాలుగున్నర నిమిషాల నిడివిగల అశ్లీల వీడియోను పంపించాడు.
మెహతా కాలనీ సంక్షేమసంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు కాలనీ సమస్యలపై ఆర్మీ అధికారి భార్య వెళ్లి అతనితో మాట్లాడుతూ వచ్చేది. దీన్ని చనువుగా తీసుకున్న ఆ ఆర్మీ అధికారి.. అశ్లీల వీడియోను పంపించాడు.
ఈ విషయాన్ని ఆమె తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత భర్త సూచన మేరకు... వసంత్ కుంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 509, ఐటీ యాక్టు ప్రకారం మెహతాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.