మహారాష్ట్రలో ప్రాణవాయువు లేకుండా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతుండటంతో ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. దీంతో వైరస్ బారిన పడి పరిస్థితి తీవ్రంగా ఉన్నవారికి వైద్యం అందక ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోతున్నాయి. అలాంటి ఘటనే నాసిక్ జిల్లా చాంద్వాడ్‌లో చోటుచేసుకుంది. కరోనా సోకిన అరుణ్ మాలి అనే వ్యక్తిని అతడి భార్య ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది.
కళ్లముందే భర్త ప్రాణాలు పోతుంటే, కాపాడుకోలేని దుస్థితిలో భార్య ఉంది. తన భర్త ఇక లేడనే వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టించింది. అందరిని ఎంతగానో బాధించింది. అందుకే కరోనాతో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం కచ్చితంగా పాటించాలని చెబుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.