మగబిడ్డ పుట్టలేదని భార్యను చంపేసిన భర్త

శనివారం, 4 జూన్ 2016 (10:30 IST)
వరుసగా నాలుగో కాన్పులోనూ ఆడపిల్లని కనిందని, మగపిల్లాడిని కనలేదని కోపంతో ఓ వ్యక్తి తన భార్యను అతిదారుణంగా హత్య చేశాడు. ఆమెను గొడ్డును ఈడ్చినట్టు ఈడ్చుకెళ్లి బావిలో తోసేసి చంపేశాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో వడోదరకు 90 కిలోమీటర్ల దూరంలోని గోద్రా తాలుకా బగిడోల్ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే మృతురాలి పేరు హేతల్ పర్మార్. ఆమె కొద్ది రోజుల క్రితమే ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది. దీంతో ఈమెకు నలుగురు ఆడపిల్లలు. వరుసగా ఆడపిల్లకే జన్మనిస్తుందని... మగపిల్లాడిని కనలేదనే కోపంతో హేతల్తో ఆమె భర్త జితేంద్ర, అత్తింటివారు తరచూ గొడవపడేవారు. 
 
ఈ విషయంపై జితేంద్ర తరచూ వేధిస్తుండేవాడని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుసగా నలుగురు ఆడిపిల్లలకు జన్మనిచ్చావని, కొడుకును కననందుకు భూమిపై జీవించే హక్కులేదని జితేంద్ర.. భార్యతో గొడవపడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. భార్యను హత్య చేసిన అనంతరం జితేంద్ర పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న జితేంద్రకోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి