ఇంటర్వ్యూ అని వెళ్తే.. గదిలోకి ప్రవేశించగానే తలుపులేసి.. 24 గంటలూ...

సోమవారం, 23 సెప్టెంబరు 2019 (15:40 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఉద్యోగం ఇప్పిస్తామని రమ్మని.. 24 గంటలు గంటలు గడపమన్నాడు. చివరికి యువతిని లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ఓ యువతి ఉద్యోగం ముంబై వచ్చింది. హాస్టల్‌లో వుంటూ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఇంకా ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ సైట్లలో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ సమయంలో సాహిల్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. 30వేల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం ఇప్పిస్తామన్నాడు. ఇంటర్వ్యూకు రమ్మాడు. 
 
ఇందుకోసం జుహులోని ఒక హోటల్‌లో ఇంటర్వూకు హాజరుకావాలని ఆమెకు ఫోన్ చేశాడు. ఇంటర్వూ కోసమని వచ్చిన ఆమె గదిలోకి ప్రవేశించగానే తలుపు లాక్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అలా మరుసటి రోజు వరకు ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం ఎవరికైనా చెప్తే.. ఆ వీడియోలను తండ్రికి పంపుతానని బెదిరించాడు. కానీ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఢిల్లీకి చెందిన వ్యక్తి అని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు