ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన మనీష్ తివారీ ఓ పారాట్రూపర్. గాల్లో తేలినట్టు, కరీనాతో కబుర్లాడుతున్నట్టు కలలు కనేవాడు. ముందు కరీనా కపూర్‌తో మాట్లాడేందుకు ఆమె మొబైల్ నెంబరు కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశాడు. అతనికి ఆమె మొబైల్ నంబరుకు బదులు పాన్ కార్డు వివరాలు లభ్యమయ్యాయి.
ఆ వివరాల ఆధారంగా ఆదాయపన్ను శాఖ ఖాతాను స్తంభింపజేశాడు. 2016-17 సంవత్సరానికి డిక్లరేషన్ ఫారం అప్‌లోడ్ చేశాడు. అయితే కరీనా తరపు చార్టెర్డ్ అకౌంటెంట్ ప్రకాష్ థక్కర్.. కరీనా డిక్లరేషన్‌ను అప్పుడే దాఖలు చేసేశారని తెలిసి అవాక్కయి.. అనుమానంతో సైబర్ నేరాల విభాగ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో వాళ్ళు దర్యాప్తు జరపగా తివారీ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. అతడ్ని అరెస్టు చేశారు.