నేను నిన్ను పోషిస్తా.. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం వచ్చెయ్ అంటూ ఇద్దరు పిల్లల తల్లి ప్రియుడితో?

శనివారం, 9 జనవరి 2021 (17:37 IST)
రెండు చేతులా సంపాదిస్తున్న భార్య. భర్త మాత్రం ఆమె కన్నా తక్కువగానే సంపాదిస్తున్నాడు. అయినా వారి మధ్య ఎలాంటి భేదాలు లేవు. ఇద్దరు పిల్లలు. ఆర్థిక సమస్యలు లేవు. కానీ ఆ భార్య మాత్రం మరో మగవాడితో పరిచయం పెంచుకుంది. చివరకు ఆ ప్రియుడే ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. అతి దారుణంగా చంపేశాడు.
 
తమిళనాడు రాష్ట్రం తిరువూర్ జిల్లా ముత్తుకూరు కొడుముడి ప్రాంతంలో నివాసముండే యువరాజ్, సంగీతలకు కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. స్థానికంగా ఆమె బ్యూటీపార్లర్ నడుపుతూ ఉండేది. భర్త కూడా హోటల్లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు.
 
అయితే సంగీతకు భర్తతో బోర్ కొట్టేసింది. ఎప్పుడూ అందంగా రెడీ అయి ఇంటి నుంచి బ్యూటీపార్లర్‌కు వెళ్ళే సంగీతకు ఎంతోమంది లైన్ వేసేవారు. అయితే అందరినీ నమ్మని సంగీత ఒకే ఒక్క యువకుడు వివేక్‌కు వివశురాలైంది.
 
సంగీత బ్యూటీ పార్లర్లో పనిచేస్తుండగా ఆమెతోనే సాయంత్రం వరకు ఉండేవాడు. ఇలా వారిద్దరి మధ్య చనువు పెరిగింది. ఆ చనువు కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా గత మూడు నెలల నుంచి ఇద్దరూ తిరుగుతూనే ఉన్నారు. అయితే ఉన్నట్లుండి సంగీత, తనకు ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదని ఎక్కడికైనా తీసుకెళ్ళమని చెప్పింది.
 
తనను పెళ్ళి చేసుకోమని ఒత్తిడి తెచ్చింది. తనను ఎక్కడికైనా తీసుకెళితే తానే బ్యూటీపార్లర్ పెట్టి నిన్ను పోషిస్తానని చెప్పింది. అయితే ఆంటీతో ఉండటం ఏ మాత్రం ఇష్టం లేని వివేక్ ఆమెకు ఏదో ఒకటి సర్దిచెబుతూ వచ్చాడు. ఆమె నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో విషయం కాస్త సంగీత భర్తకు తెలిసింది.
 
దీంతో ఇద్దరిని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు సంగీత భర్త. అయినా సంగీత మాత్రం మారలేదు. వివేక్‌తో తిరుగుతూనే ఉండేది. సంగీతపై కోపం పెంచుకున్నాడు వివేక్. ఆమెను ఎలాగైనా చంపేయాలనుకున్నాడు. ఫ్రెండ్ గదికి వెళదామని పిలిచి బైక్ పైన ఎక్కించుకుని గ్రామం సమీపంలోకి తీసుకెళ్ళాడు. ఆమెతో శృంగారం చేసాడు. ఆ తరువాత బండరాయి తీసుకుని తలపై మోది చంపేశాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్లు వెళ్ళిపోయాడు.
 
పోలీసులు రంగప్రవేశం చేయడంతో పాటు పోస్టుమార్టం రిపోర్ట్ బయటపడటంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంగీత మరణంతో ఆమె కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు