తన బోయ్ ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని అతడికి రూ. 20 వేలు ట్రాన్స్‌ఫర్ చేసేసింది ఓ వివాహిత. ఐతే ఆ డబ్బు తన భర్త సంపాదించినది కావడంతో డబ్బు ఎక్కడ అని అడిగారు. దాంతో ఉన్న నిజాన్ని చెప్పేసింది ఆ వివాహిత. అంతే... ఆమెపై అత్తింటివారు ఇంతెత్తున లేచి విరుచుకుపడ్డారు. వీడియోలో కనిపించని గొంతు ఒకటి మాత్రం ఆమెను దూషిస్తున్నట్లు అర్థమవుతుంది.