పూటుగా మద్యం తాగి బుధవారం అర్థరాత్రి ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు ఓ యువతి వచ్చింది. పోలీస్ స్టేషన్ ముందు హల్చల్ చేస్తూ నానా హంగామా సృష్టించింది. స్టేషన్‌లో సి.ఐ, ఎస్.ఐ స్థాయి అధికారులను, ఇతర సిబ్బందిని బావా.. బావా అంటూ పిలుస్తూ మీదమీదకు వెళ్లబోయింది. ఈ హఠత్పరిణామానికి అక్కడివారంతా అవాక్కయ్యారు.