అన్నాడీఎంకేలోకి ఎంజీఆర్ మనువడు..

గురువారం, 4 మార్చి 2021 (14:33 IST)
MGR Grandson
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకేలోకి ఎంజీఆర్ మనువడు చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంకా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్దంగా వున్నారని వార్తలు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ ఆరో తేదీన జరుగనున్నాయి. 
 
ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే తరపున పోటీ చేసేందుకు ఎంజీఆర్ మనువడు వి. రామచంద్రన్ సిద్ధమని నామినేషన్ దాఖలు చేశారు. ఆలందూర్, పల్లావరం, ఆండిపట్టి నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు జరిగిన ఇంటర్వ్యూల్లో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎంజీఆర్ మనవడు అనే హోదా రామచంద్రన్‌కు బాగా కలిసొస్తుందని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు