గోల్డెన్ బే రిసార్ట్స్‌లో మంగళవారం అర్థరాత్రి వరకూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శశివర్గంలోని చాలామంది ఎమ్మెల్యేలు బస్సుల్లో, తమ వాహనాల్లో గోల్డెన్ బే రిసార్టును వీడి వెళ్లారు. దీంతో దాదాపు సగం మంది ఎమ్మెల్యేలకు పైగానే రాత్రి రిసార్ట్‌ను వదిలి ఇళ్లకు చేరుకున్నారు. కానీ మిగిలిన ఎమ్మెల్యేలు ఇంకా రిసార్ట్‌లోనే ఉన్నారు. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు జంప్ ఇవాళ ఉదయం జంప్ అయినట్లు తెలుస్తోంది.
శశికళ వ్యవహారం చూస్తున్న తమిళ ప్రజలు చాలా ముదురని విమర్శిస్తున్నారు. అమ్మ వెంట వుండీ ఇలాంటి ఎత్తుగడలతోనే శశికళ జయను కీలుబొమ్మను చేసివుంటుందని వారు మాట్లాడుకుంటున్నారు. కానీ శశికళకు చెక్ పెట్టి అన్నాడీఎంకేలో గూండాలను ఇంటికి పంపించాలనుకున్న పన్నీరు బలపరీక్షలో నెగ్గుతారా? ఎమ్మెల్యేలు పళనికి సపోర్ట్ చేసి.. చిన్నమ్మను నెత్తిన పెట్టుకుంటారా? లేకుంటే వీరవిధేయుడైన పన్నీరుకు హ్యాండిస్తారా అనేది తెలియాల్సి వుంది.