బీహార్ రాష్ట్రంలో మొబైల్ టవర్ అపహరణ... ఎలా?

ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (10:18 IST)
బీహార్ రాష్ట్రంలో మొబైల్ టవర్‌‍ను కొందరు దుండగులు అపహరించారు. మొత్తం 4 గంటల పాటు శ్రమించి ఈ టవర్‌ను చోరీ చేశారు. మొబైల్ టవర్‌ను విడి భాగాలుగా చేసి తమ వెంట తీసుకొచ్చిన వాహనంలో ఆ భాగాలను వేసుకుని పారిపోయారు. ఇందులో మొబైల్ టవర్ జనరేటర్, స్టెబిలైజర్ ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ చోరీ జరిగింది.
 
స్థానిక శ్రమజీవి నగర్‌లో మనీషా కుమారి అనే మహిళ ఇంటి సమీపంలో మొబైల్ టవర్‌ను ఏర్పాటుచేశారు. అయితే, సాంతిక కారణాలతో కొన్ని నెలలుగా ఆ టవర్ ఉపయోగంలో లేకుండాపోయింది. దీంతో రెండు రోజుల క్రితం దానిని బాగు చేసేందుకు కంపెనీ ప్రతినిధులు అక్కడకు రాగా, అక్కడ టవర్ లేకపోవడంతో విస్తుపోయారు. దీంతో కంపెనీ ప్రతినిధి షానవాజ్ అన్వర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు... కొద్ది రోజుల క్రితం కొంతమంది వ్యక్తులు ఆ టవర్ వద్దకు వచ్చారు. తామంతా మొబైల్ టవర్ సంస్థకు చెందిన ఉద్యోగులమని, ఇపుడు ఈ టవర్‌తో తమకు పనిలేదని, అందుకే తొలగిస్తున్నట్టు చెప్పి, టవర్ మొత్తం భాగాన్ని విడి భాగాలుగా చేసి వ్యానులో వేసుకుని వెళ్లారని పోలీసులకు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు