ఒకవైపు ఆమెను వేధిస్తూనే ఆమె ఇంట్లోనే డిన్నర్‌కి ఆమ్లెట్లు కూడా వేసుకుని తిన్నాడు. కత్తి చూపి బెదిరించి.. మంచానికి కట్టేసి.. పోర్న్(అశ్లీల) వీడియోలు చూపించి.. లైంగికంగా వేధించి ఆమె ఏటీఎం కార్డులు లాక్కుని.. క్రూరంగా హింసించి పిన్ నంబర్లు తెలుసుకుని.. చివరికి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసినట్టు పోలీసులు విచారణలో నిందితుడు పూసగుచ్చినట్టు వెల్లడించాడు. ఈ హత్య ఈనెల ఐదో తేదీన జరిగింది. ఆమె వద్ద దొంగిలించిన ఏటీఎం కార్డులను తీసుకెళ్లి బెంగళూరులో డ్రా చేసి పోలీసులకు చిక్కిపోయాడు.