పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. మైనర్ బాలుడైన మేనల్లుడిని బెదిరించి ఓ అత్త అతడిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడింది. పూర్తి వివరాలను చూస్తే... పరగణా జిల్లా పరిధిలోని ఓ మారుమూల పల్లెటూర్లో ఓ మహిళ ఒంటరిగా జీవిస్తోంది. అక్కడికి తన సోదరుడు కుమారుడు మైనర్ అయిన మేనల్లుడు వెళ్లాడు. ముందు కొన్నిరోజులపాటు అతడి పట్ల మామూలుగానే వుంటూ ఆ తర్వాత క్రమంగా బాలుడితో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించింది. అలా మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడింది. ఆ సమయంలో వీడియోలు కూడా తీసింది.
ఎవరికైనా చెబితే ఆ వీడియోలు బైట పెడతానంటూ బాధితుడిని బెదిరిస్తూ అతడిపై కోర్కె తీర్చుకుంది. ఊరి నుంచి తిరిగి వచ్చిన బాలుడు మౌనంగా మూలన కూర్చుని వుంటున్నాడు. బాలుడి ప్రవర్తనతో అనుమానం వచ్చిన అతడి తల్లి గట్టిగా నిలదీయడంతో... అత్తయ్య తనపై అత్యాచారం చేసిందంటూ బోరుమంటూ విలపిస్తూ తల్లి వద్ద చెప్పాడు. దీనితో విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.