వివరాల్లోకి వెళితే.. దుమ్కా జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం దంపతులు బయటకు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు. ఆమె భర్తపై దాడికి పాల్పడి నిర్బంధించారు. అతడి కళ్లముందే 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. కేసును చాలా సీరియస్గా తీసుకున్నామని చెబుతున్నారు. ఇక, ఆ 17 మంది నిందితులుగా ఫుల్గా మద్యం సేవించి ఉన్నట్టుగా చెబుతున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కానీ అంత దారుణ హింసకు గురైన ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.