''ఈశ్వరుడు'' అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్న కోలీవుడ్ హీరో శింబు... నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో ఓ గ్రామీణ నేపథ్యంలో చిత్రం చేయనున్నాడు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. అయితే కొన్ని నెలలుగా శింబు పడుతున్న కష్టం, వర్క్‌పై ఆయనకున్న అంకిత భావాన్ని చూసి మురిసిపోయిన శింబు తల్లి బ్రిటీష్ రేసింగ్ కారు మినీ కూపర్‌ను శింబుకు బహుమతిగా ఇచ్చారు.