నలుగురు కూతుళ్లను గొంతుకోసి చంపేసిన తల్లి.. 8 నెలల బిడ్డను కూడా వదిలి పెట్టలేదా..?

శనివారం, 28 నవంబరు 2020 (16:41 IST)
క్షణికావేశాలు హత్యలకు దారితీస్తున్నాయి. ఓపిక లేకపోవడం.. ఆవేశాలకు గురికావడంతో నేరాలు జరిగిపోతున్నాయి. తాజాగా గుర్గామ్‌లో దారుణం చోటుచేసుకుంది. నలుగురి కూతుళ్ల గొంతులు కోసి తానూ ఆత్మహత్య చేసుకుంటుండగా ఒక తల్లి పట్టుబడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గుర్‌గామ్‌కు సరిహద్దు గ్రామమైన పిప్రోలి గ్రామంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఉంటున్న ఫర్మినాకు ఖుర్షీద్ కు 2012లో వివాహమైంది. ఫర్మినాకు ఇది రెండో వివాహం. వీరికి నలుగురు సంతానం. 
 
కాగా.. వారిలో చివరికూతురు వయసు 8 నెలలే. మిగిలిన వారి వయసు కూడా పదేళ్లకు మించదని స్థానికులు చెబుతున్నారు. అయితే శుక్రవారం ఫర్మీనా.. అర్థరాత్రి తన నలుగురు కూతుళ్ల గొంతు కోసి హత్య చేసింది. నలుగురిని ఒకే కత్తితో గొంతు కోసి చంపేసింది. నలుగురిని చంపి తానూ గొంతు కోసుకుంటుండంతో అదే సమయంలో ఖుర్షీద్ ఇంటికి చేరుకున్నాడు.
 
కిటికీలోంచి ఇది చూసిన ఖుర్షీద్.. తలుపులను గట్టిగా బాదాడు. వాటిని బద్దలు కొట్టుకుని వెళ్లగా.. ఆమె అప్పటికే హత్యాయత్నానికి పాల్పడుతుంది. దీంతో ఖుర్షీద్.. ఆమె దగ్గరున్న కత్తిని తీసుకున్నాడు. పక్కనున్న గదిలోకి వెళ్లి చూసేసరికి నలుగురు కూతుళ్లు రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. అనంతరం ఫర్మీనాను ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
 
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. అయితే ఫర్మీనా తన కూతుళ్లను ఎందుకోసం చంపిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఖుర్షీద్, ఫర్మీనా అన్యోన్యంగానే ఉండే వారని.. వారి మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయినా ఫర్మీనా ఎందుకిలా చేసిందనే దానిమీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు