హనీట్రాప్ మాయలో రాజకీయ నేతలు... రూ.లక్షలు దోచుకున్న మహిళలు

గురువారం, 19 సెప్టెంబరు 2019 (14:29 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు మహిళలు కిలేడీలుగా మారిపోయారు. హనీట్రాప్ పేరుతో పలువురు రాజకీయ నేతలను వలలో వేసుకున్నారు. ఆ తర్వాత వారిని బెదిరిస్తూ లక్షలాది రూపాయలను సంపాదించారు. 
 
భోపాల్‌లో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇండోర్ నగరానికి చెందిన ముగ్గురు మహిళలు ఓ యువకుడు కలిసి ముఠాగా ఏర్పాడ్డారు. వీరు హనీ కొందరు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేశారు. ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలను గుంజుకున్నారు. 
 
ఈ ముఠా బాధితుల్లో కొందరు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో నిఘా వేసిన పోలీసులు... ఈ హనీట్రాప్ ముఠాను అరెస్టు చేసారు. ఈ ముఠా పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను బ్లాక్ మెయిల్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ కేసు దర్యాప్తును మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తు చేపట్టింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు