ఆ తర్వాత మహాపాత్ర కుమారులు జశోబంత, ప్రశాంత కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. వీరిద్దరినీ ఎయిమ్స్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. ప్రశాంత గురువారం కన్నుమూయగా, పెద్దవాడైన జశోబంత శుక్రవారం తుదిశ్వాస విడిచాడు.
రఘునాథ్ మహాపాత్ర గొప్ప శిల్పిగా ఖ్యాతి పొందారు. ఆయనకు కేంద్రం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది. ఇక, ఆయన కుమారుడు ప్రశాంత ఒడిశా రంజీ క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. కొన్నిరోజుల వ్యవధిలోనే ఆయన, ఇద్దరు కుమారుల మరణంతో ఒడిశా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.