అటార్నీ జనరల్ పదవిని తిరస్కరించిన ముకుల్ రోహత్గీ

సోమవారం, 26 సెప్టెంబరు 2022 (10:17 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిపాదించిన అటార్నీ జనరల్ పదవిని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ తిరస్కరించారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం పీటీఐ వార్తాసంస్థతో ధ్రువీకరించారు. 
 
అయితే, తాను ఈ తరహా నిర్ణయం తీసుకోవడం వెనుక నిర్దిష్ట కారణం ఏమీ లేదన్నారు. ప్రస్తుతం అటార్నీ జనరల్‌గా కొనసాగుతున్న కేకే వేణుగోపాల్‌ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది. అనంతరం కొనసాగడానికి వేణుగోపాల్‌ ఇప్పటికే తిరస్కరించారు. 
 
దీంతో ఆ పదవిని చేపట్టాలని రోహత్గీని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించినా అందుకు రోహత్గీ అంగీకరించలేదు. రోహత్గీ ఇదివరకు 2014 జూన్‌ 19 నుంచి 2017 జూన్‌ 18 వరకు అటార్నీ జనరల్‌గా కొనసాగారు. 
 
అప్పుడు రెండోసారి కొనసాగించడానికి ప్రభుత్వం ప్రయత్నించగా తిరస్కరించారు. దాంతో 86 ఏళ్ల వయస్సులో కేకే వేణుగోపాల్‌ను మూడేళ్ల కాలానికి ప్రభుత్వం ఆ బాధ్యతలు అప్పగించింది. తర్వాత ఆయన్నే కొనసాగించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు