ఈ పిలుపు భారీ స్పందన వచ్చింది. రెండువేల మంది ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్, సామాజిక కార్యకర్తలు రంగులు వేయటానికి ముందుకొచ్చారు. కొన్ని కంపెనీలు, ప్రభుత్వ సహకారం తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి ఇప్పటివరకు 300 ఇళ్లకు పెయింటింగ్ వేశారు.
రోడ్ల పక్కన, బ్రిడ్జీలు, షాపులకు కూడా అద్భుతమైన బొమ్మలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఖర్ దండా ఏరియా మొత్తం పెయింటింగ్ పనుల కోసం మూడు నెలల సమయం పడుతుందని, ప్రస్తుతం స్థానికుల సహకారం కూడా అందుతోందని వాలంటీర్లు చెప్తున్నారు. ఈ పెయింటింగ్‌ను చూస్తే.. మురికివాడల్లా లేవని.. పై నుంచి చూస్తే సినిమా సెట్టింగ్‌లా వుందని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.