ఒక విదేశీయుడు భారతదేశంలోకి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను తీసుకెళ్తున్నాడని అందిన సమాచారం మేరకు ఈ ఆపరేషన్ చేపట్టినట్లు డిఆర్ఐ సీనియర్ అధికారులు తెలిపారు. "ఈ సమాచారం మాకు అందిన వెంటనే, మేము విమానాశ్రయంలో గస్తీని పెంచాము. విదేశాల నుండి వచ్చే ప్రయాణీకులందరినీ ప్రశ్నించడం ప్రారంభించాము" అని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అనుమానిత సూట్‌కేస్‌పై శోధించాం. చివరికి లోపల ద్రవ కొకైన్‌ను కనుగొన్నామన్నారు.