నమో యాప్‌ను వినియోగిస్తున్న వారి వ్యక్తిగత వివరాలు సహా ఫోటోలు కూడా సంస్థకు చేరుతున్నట్లు ఎల్డర్సన్ చెప్పారు. క్లెవర్ ట్యాప్ ఓ అత్యాధునిక యాప్ నిర్వహణ వేదికని, యూజర్లను గుర్తించి డెవలపర్స్‌ను అభివృద్ధి చేసేందుకు మార్కెటింగ్ నిపుణులకు ఇది సాయపడుతుందని ఎల్డర్సన్ వివరించారు. ఇక యూజర్ల సమాచారాన్ని కెప్లెర్ ఎందుకు భద్రపరుస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకమని తెలిపారు.
ఈ యాప్‌పా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో రాహుల్ వ్యంగ్యంగా కామెంట్లు పెట్టారు. ''హాయ్ నా పేరు నరేంద్రమోదీ. నేను భారత ప్రధానమంత్రిని. మీరు నా మొబైల్ యాప్‌లో సైన్ ఇన్ అయినప్పుడు మీ డేటా మొత్తాన్ని నేను అమెరికన్ కంపెనీల్లోని నా స్నేహితులకు చేరవేస్తాను'' అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.