పూర్తి వివరాల్లోకి వెళితే... గ్వాలియర్‌కి చెందిన ఓ వ్యక్తికి 2016లో పెళ్లయింది. పెళ్లయిన వెంటనే ఆరోగ్యం బాగా లేదంటూ భార్య పుట్టింటికి వెళ్లింది. ఇక అప్పట్నుంచి ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా అంటూ కబుర్లే కానీ భార్య రావడంలేదు. దానితో తన భార్యను ఇంటికి రప్పించి కాపురం చేసుకునేందుకు సదరు వ్యక్తి తన తల్లిదండ్రులను, బంధువులను రంగంలోకి దింపాడు. దాంతో ఆమె భర్త దగ్గరకు రాక తప్పలేదు.
తొలిరాత్రి ఏర్పాటు చేసారు. ఆ రాత్రి ఆమెను చూసి షాక్ తిన్నాడు భర్త. తను మోసపోయానంటూ గొడవ గొడవ చేయడం మొదలుపెట్టాడు. విషయం ఏంటని ఆరా తీస్తే... తన భార్యకు పురుషాంగం వుందనీ, ఆమె అసలు ఆడది కాదనీ, మోసం చేసి తనకు మగవాడినిచ్చి పెళ్లి చేసారంటూ గొడవ చేసాడు.
ఆమెను పరీక్షించిన వైద్యులు అది ఓ జెనెటిక్ సమస్య అనీ, చాలా అరుదుగా కొంతమంది అమ్మాయిల్లో ఇలాంటి సమస్య ఎదురవుతుందని తేల్చారు. పుట్టుకతో స్త్రీగా వున్నప్పటికీ ఈ కారణంగా బాహ్య జననేంద్రియాల వద్ద చిన్నసైజు పురుషాంగం వుంటుందనీ, దీన్ని శస్త్రచికిత్స చేసి తొలగించవచ్చన్నారు. ఐతే ఇలాంటి వారికి పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువగా వుంటుందని చెప్పారు.
దీనితో తన భార్యకు విడాకులు ఇస్తానని చెప్పి హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటీషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఐతే సదరు బాధితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మొదట్లో ఈ పిటీషన్‌ను స్వీకరించేందుకు తిరస్కరించినప్పటికీ పూర్తి వివరాలు చూసిన తర్వాత స్వీకరించింది. బాధితుడి ఫిర్యాదుపై నాలుగు వారాల్లోపు సమాధానం ఇవ్వాలని అతడి భార్యకి, ఆమె తల్లిదండ్రులకి నోటీసులు పంపింది.