నిండు గర్భిణి.. కిడ్నాప్ చేసి మెడపై కత్తి పెట్టి.. సామూహిక అత్యాచారం

బుధవారం, 8 జులై 2020 (22:08 IST)
నిర్భయ, దిశ లాంటి చట్టాలు వచ్చినా కామాంధుల్లో మార్పు రాలేదు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే వున్నాయి. తాజాగా నాగపూర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గర్భిణిపై కామాంధులు అకృత్యానికి పాల్పడ్డారు. 
 
ఓ మహిళ నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. నాగపూర్ పట్టణంలో ఓ నిండు గర్భిణీ పై ముగ్గురు వ్యక్తులు పైశాచిక దాడికి పాల్పడ్డారు. మరో మూడు నెలల్లో పండంటి బిడ్డకు జన్మను ఇవ్వాల్సిన మహిళపై దారుణానికి ఒడిగట్టారు.
 
సదరు ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి ఓ బిల్డింగ్ టెర్రస్ పైకి తీసుకు వెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో మహిళ మెడపై కత్తి పెట్టి మరి దారుణానికి ఒడిగట్టారు. 
 
ఈ సంఘటన అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు