ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ విద్యార్థిని మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానందకు చెందిన ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న సుఖ్‌దేవానంద్ కళాశాలలో బిఎ రెండో సంవత్సరం చదువుతోంది. సోమవారం తండ్రితో కలిసి కళాశాలకు వచ్చింది. అయితే, సాయంత్రం 3 గంటలకు కళాశాల ముగిసినా ఆమె బయటకు రాలేదు.
దాదాపు 60 శాతం గాయాలయ్యాయని, ముఖం, మెడ, ఛాతి తదితర భాగాల్లో కాలిన గాయాలున్నాయని, మెడ భాగంలో వాపు ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఏ వివరాలూ వెల్లడించే స్థితిలో లేదని, ఆమె కోలుకున్నాకే అసలు ఏం జరిగిందన్న విషయం తెలుస్తుందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతు న్నామని ఎస్పీ ఆనంద్ వెల్లడించారు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ విద్యార్థిని దుస్తులు కనిపించలేదన్నారు.
మరో ఏడేళ్ల బాలిక గాయాలతో పక్క ఊరిలో పడిపోయి ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, సోమ, మంగళవారాలు రెండు రోజుల్లోనే లిఖింపుర్ జిల్లాలో కళాశాలకు వెళ్లిన నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు.