పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద తండాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అయితే, ఆయన నేరుగా స్పందించక పోయినప్పటికీ.. ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చుతూ భారత ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపించారు.
పాకిస్థాన్‌లో సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మన సైన్యం గురించే మాట్లాడుతున్నారనీ, ఈ విషయంలో మన జవాన్ల సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు.