ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చి శుక్రవారంతో మూడేళ్లు. దీనికి గుర్తుగా ప్రధాని మోడీ అతిపెద్ద వంతెనను ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద తొలి వంతెన కావడం గమనార్హం. మొత్తం 9.15 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెనను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించారు. అస్సాంలోని సాదియా, అరుణాచల్‌ప్రదేశ్‌లోని ధోలాలను ఈ సేతువు కలుపుతుంది.
ఇకపోతే.. చైనో-ఇండియా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో యుద్ధ సమయంలో యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సైన్యానికి వేగంగా చేరవేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్, అసోం ప్రజలు ఎయిర్‌పోర్టు, రైలు మార్గాలను వేగంగా చేరుకునే వెసులుబాటును ఈ బ్రిడ్జి కల్పిస్తోంది.
వంతెన నిర్మాణం 2011లో ప్రారంభమైంది. ఈ వంతెన నిర్మాణం కోసం రూ.950 కోట్లను ఖర్చు చేశారు. అసోం రాజధాని దీస్ పూర్‌కు 540 కిలోమీటర్లు, అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపే ఉంది. దీంతో డ్రాగన్ కంటీ ఇటువైపు ఓ కన్నేసి ఉంచింది.