ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అతిపెద్ద గండం పొంచివుందట. వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఈ గండంలో ఆయన చిక్కుకోనున్నారట. అయితే, ఈ గండం నుంచి ఆయన బయటపడగలిగితే.. మరో పుష్కరకాలం (12 యేళ్లు) పాటు ఎలాంటి ఢోకా లేదని బెంగుళూరుకు చెందిన జ్యోతిష్యులు చెపుతున్నారు. అలాగే, స్త్రీ దోషం కూడా ఉందట. ఇంతకీ ఈ గండం, స్త్రీ దోషం గురించి కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్యుడు బ్రహ్మాండ నరేంద్ర శర్మ గురూజీ ఏం చెప్పారో ఓ సారి పరిశీలిద్ధాం.
2017 మాఘమాసంలో అంటే ఫిబ్రవరి నెలలో ప్రధాని నరేంద్ర మోడీకి గండం పొంచి ఉందని చెప్పారు. ఆయన ఇప్పటికీ రెండు పెనుగండాల నుంచి సురక్షితంగా తప్పించుకున్నారు. ఇందులో ఆప్ఘనిస్థాన్‌తో ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని ప్రయాణించిన విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఇక రెండో గండం పాకిస్థాన్‌కు ప్రధాని నరేంద్ర మోడీ ఆకస్మికంగా పాకిస్థాన్ వెళ్లారు. ఇది ఆయనకు స్వదేశంలో అపకీర్తి తెచ్చిపెట్టింది. ఈ పర్యటన సమయంలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో జరిగిన ఓ వివాహ వేడుకకు మోడీ హాజరైన సంగతి తెల్సిందే.
ప్రధానికి మూడో గండంలో ఏ రూపంలో వస్తుందో చెప్పలేమని అయితే దీని నుంచి ఆయన సురక్షితంగా తప్పించుకుంటే 12 ఏళ్ల పాటు ఢోకా ఉండదని ఆయన చెపుతున్నారు. ప్రధానికి స్త్రీ దోషం ఉందని పేర్కొన్న గురూజీ భార్య దూరం కావడం, తల్లి దూరంగా ఉండటం వంటి కారణంగా ఈ దోషం నుంచి ఆయన తప్పించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తల్లిని తన ఇంట్లో తెచ్చిపెట్టుకొని సేవలు చేస్తే ఈ దోషం నుంచి తప్పించుకొనే అవకాశం ఉందన్నారు.