జులై 1న నేషనల్ డాక్టర్స్ డే - జాతిపిత స్నేహితుడి గౌరవార్థం.. థీమ్ ఇదే..

సెల్వి

సోమవారం, 1 జులై 2024 (12:08 IST)
దేశవ్యాప్తంగా జులై 1న నేషనల్ డాక్టర్స్ డేను జరుపుకుంటారు. దేశ ప్రజల కోసం లక్షలాది మంది డాక్టర్లు, ఆసుపత్రులు అందిస్తున్న నిరంతర సేవలకు గుర్తింపు, గౌరవ సూచకంగా కేంద్ర ప్రభుత్వం 1991 నుంచి ఈ డాక్టర్స్ డేను నిర్వహిస్తున్నారు.  
 
జాతిపిత మహాత్మా గాంధీకి స్నేహితుడైన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్.. ఆయనకు వ్యక్తిగత వైద్యుడిగానూ వ్యవహరించారు. కేంద్రం ఆయనను 1961లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’తో సత్కరించింది. 
 
వైద్య వృత్తికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకోవడంతోపాటు వృత్తి నిబద్ధత, వైద్య రంగంలో మానవతా విలువల పెంపు కోసం నేషనల్ డాక్టర్స్ డేను కేంద్రం అమలు చేస్తోంది.
 
థీమ్
ఈ ఏడాది డాక్టర్స్ డే థీమ్ ‘హీలింగ్ హ్యాండ్స్.. కేరింగ్ హార్ట్స్’. వ్యాధులు లేదా అనారోగ్యంతో సతమతమయ్యే రోగులకు సాంత్వన చేకూర్చడంలో వైద్యులు పోషించే పాత్రను తెలియజెప్పడం ఈ థీమ్ ఉద్దేశం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు